తెలంగాణ

హైడ్రాపై హైకోర్టు సీరియస్.. సీఎం రేవంత్ కు క్లాస్!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరవ్వాలని స్పష్టం చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైడ్రాను ప్రశ్నించింది హైకోర్టు. అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసింది హైడ్రా. దీనిపై భవన యజమాని హైకోర్టులో పిటిషన్ వేశారు. స్టే ఉన్నా కూల్చివేశారని ఆరోపించారు. ఈ కేసు విచారణ సందర్బంగా హైడ్రాపై సీరియస్ కామెంట్లు చేసింది హైకోర్జు ధర్మాసనం. వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ ను ఆదేశించింది.

మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవిన్యూ అధికారులు చేస్తున్న మార్కింగులు రచ్చరచ్చగా మారుతున్నాయి. మూసీ తీరంలో నివస్తున్న ప్రజలు ఎక్కడిక్కడ ఆందోళన చేస్తున్నారు. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారు. కట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు వచ్చి కూలగొట్టేస్తా అంటే ఎవడు ఒప్పుకుంటాడని బాధితులు నిలదీస్తున్నారు. మా ఇల్లు పోతే మేము రోడ్డు మీద ఉండాలి.. మేము అందరం ఊరి పెట్టికోను సచ్చిపోతాం.. మా శవాల మీద రోడ్లు వేసుకోండి అంటూ మండిపడుతున్నారు.

Read More : హైడ్రా బాధితుల భ‌యం.. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద భ‌ద్ర‌త పెంపు 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడమంతా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదని మూసీ బాధితులు భగ్గుమంటున్నారు. వాళ్ళకి అంత కూల కొట్టాలని ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫార్మ్ హౌస్లు కూలగొట్టమనండని సూచిస్తున్నారు.

Back to top button