క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మూసీ నది ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రివర్ బెడ్ మార్కింగ్ కూడా వేశారు. దీంతో బాధిత ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.
మూసీ బాధితులంతా కూల్చివేతలను నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మూసీ బాధితులు దాడి చేస్తారేమో అనే భయంలో గాంధీ భవన్ వద్ద భద్రత పెంచారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు, వ్యాపార సంస్థలు కోల్పోయిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌కు బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు.
ఇక్కడ కూడా చదవండి..
Hydra News : గొంతులోకి అన్నం దిగట్లేదు.. చచ్చిపోతాం.. హైడ్రా బాధితుల కన్నీళ్లు
Karnataka Siddaramaiah : సిద్దరామయ్య అవుట్.. సీఎంగా డీకే.. పొంగులేటితో రేవంత్ కు టెన్షన్
Hydra Suicide : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!
High Court Serious : హైడ్రాపై హైకోర్టు సీరియస్.. సీఎం రేవంత్ కు క్లాస్!