ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి క్లోజ్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :  కుండపోత వానలతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో అతలాకుతలం అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గతంలో ఎప్పుడు లేనంతగా వర్షం కురిసింది. సూర్యాపేట, కృష్ణా జిల్లాలో కుండపోతగా వర్షం కురవడంతో రహదారులన్ని చెరువులుగా మారిపోయాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి పైకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేశారు.

నందిగామ మండలం మునగచర్ల వద్ద వరద నీరు జాతీయ రహదారి పైకి భారీగా చేరింది. దీంతో విజయవాడ హైదరాబాద్ రహదారి పై భారీగా నిలిచిపోయాయి వాహనాలు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వాహనాలను ఒక మార్గాన పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉన్నందున ప్రయాణాలు ఆపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read More : నీట మునిగిన సుర్యాపేట,కోదాడ మున్సిపల్ ఆఫీసులు

భారీ వర్షాల నేపథ్యంలో జగ్గయ్యపేట వద్ద రోడ్డు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్ ను మళ్లించారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళుటకు నార్కెట్పల్లి నుండి వయా మిర్యాలగూడ ,గుంటూరు మీదిగా విజయవాడకు ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. హైవే వెంట అధిక వాహనాలు ప్రయాణించే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ పవార్ సూచించారు.
హైవే వెంట అధిక వాహనాలు వెళ్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు ప్రమాదాల గురుకాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

Spread the love
Back to top button