తెలంగాణరంగారెడ్డిరాజకీయంహైదరాబాద్

అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..

రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. సివిల్ సప్లయ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు.. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు. వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు. సెప్టెంబర్ 21 న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రులు.

ఇక్కడ కూడా చదవండి .. 

Hydra GandhiBhavan : హైడ్రా బాధితుల భ‌యం.. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద భ‌ద్ర‌త పెంపు

Constable Suicide : కలెక్టరేట్‌లో కానిస్టేబుల్ సూసైడ్.. ఇబ్రహీంపట్నంలో విషాదం

HYDRA VICTIMS : గొంతులోకి అన్నం దిగట్లేదు.. చచ్చిపోతాం.. హైడ్రా బాధితుల కన్నీళ్లు

Karnataka Cm : సిద్దరామయ్య అవుట్.. సీఎంగా డీకే.. పొంగులేటితో రేవంత్ కు టెన్షన్

Back to top button