రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ తన వెపన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈరోజు తెల్లవారుజామున ఏ ఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్(28) తన పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటనతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో కలకలం రేగింది. కాల్పుల శబ్దంతో అంతా ఉలిక్కిపడ్డారు.
కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న దూసరి బాలకృష్ణ.. తెల్లవారుజామున బాత్రూం గదిలోకి వెళ్లారు. తలుపులు మూసివేసి, తన సొంత ఆయుధంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ మృతి చెందినప్పుడు మృతులతోపాటు సహ ఉద్యోగులు ముగ్గురు ఉన్నట్లు సమాచారం.మృతదేహాన్ని ఆదిభట్ల పోలీసులు నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మంచాల మండల కేంద్రం. మృతుడు బాలకృష్ణ ఆన్లైన్ గేమ్స్ బానిసై చేసుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంచాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read : సిద్దరామయ్య అవుట్.. సీఎంగా డీకే.. పొంగులేటితో రేవంత్ కు టెన్షన్
Read More : RRR రికార్డులు బద్దలు.. దేవర్ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా..
Read More : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!