
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు గూగుల్ డేటా సెంటర్ త్వరలోనే రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ google డేటా సెంటర్ రావడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వమని కొంతమంది, వైసీపీ పార్టీ అని మరి కొంతమంది వాదిస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం కు డేటా సెంటర్ రావడానికి ముఖ్య కారణం వైసీపీ పార్టీ అని అన్నారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ… తాటిపర్తి చంద్రశేఖర్ గూగుల్ డేటా సెంటర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదానీ డేటా సెంటర్కు బీజం వేసింది మా ప్రభుత్వంలోనే అని… సింగపూర్ నుంచి సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు చేశాం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, దాదాపు 190 ఎకరాల భూమి, 300 మెగా వాట్ల సెంటర్ కు శంకుస్థాపన మా ప్రభుత్వంలోనే చేసాం కాబట్టే నేడు గూగుల్ సంస్థ ఆదానితో చేతులు కలిపి డేటా సెంటర్ విస్తరణకు సాధ్యమైంది అని క్లారిటీ ఇచ్చారు. 2020, నవంబర్ లో కోవిడ్ కాలంలోనే ఈ డేటా సెంటర్ కు మా ప్రభుత్వంలో పునాది పడింది అని… కానీ అది ఈరోజు మేము తెచ్చామని మీరు చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఓటమి ప్రభుత్వంపై ఆరోపణ చేశారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. మరి ఈ గూగుల్ డటా సెంటర్ రావడానికి ఎవరు కారణమని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : కర్నూల్ ఘటన ఎఫెక్ట్.. జర్నీలు వద్దు బాబోయ్ అంటున్న ప్రజలు?
Read also : భారత్ కు గుడ్ న్యూస్… మళ్లీ ఆ ప్లేయర్స్ రీ ఎంట్రీ?




