
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొంథా తుఫాన్ పొంచి ఉన్న కారణంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు కీలక ఆదేశాలు చేశారు. వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తుఫాన్ కారణంగా ఏ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆయా ప్రాంత పరిసరాలలో ఉన్నటువంటి మన కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి అని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను భద్రంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని… అత్యవసరమైతే నిత్యవసర సరుకులు కూడా అందించాలి అని ఆదేశించారు. ఈ తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 28వ తేదీన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన ర్యాలీలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ తిరిగి మళ్లీ నవంబర్ నాలుగవ తేదీన ప్రారంభించాలని వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ల యొక్క పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అన్ని గ్రామాల గ్రూపులలో ప్రత్యేకంగా అవసరాలు ఉన్నవారు సమాచారాన్ని అందించాలి అని సూచించారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా వెంటనే పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో ఈ తుఫాన్ ప్రభావం కారణంగా విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించారు. ఏవైనా అత్యవసర పరిస్థితిలో ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలి అని తెలిపారు. కాబట్టి ఎంత వీలైతే అంత బయటకు వెళ్లకపోవడమే మంచిది అని సూచించారు.
Read also : మద్యం మత్తులో జల్సాలు చేసేవారు టెర్రరిస్టులతో సమానం : సజ్జనార్
Read also : తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వండి : సీఎం




