
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- గత వైసిపి ప్రభుత్వంపై నేడు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలోనే వివిధ మద్యం బాటిల్లను అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదించారని అన్నారు. వివిధ బ్రాండ్ల మద్యం బాటిల్లను ముందర పెట్టుకొని నేడు మీడియాతో ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడారు. లిక్కర్ స్కాం కేసులో సూత్రధారి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. వైసిపి హయాంలో ఊరు పేరులేని మద్యం తెచ్చి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. డబ్బులు దోచుకునేందుకే గత వైసిపి ప్రభుత్వం మద్యం దుకాణాలు తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. స్కామ్ చేసింది వైసీపీ వాళ్లు కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా?.. అని టిడిపి నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
Read also : పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శలు చేస్తూనే ఉన్నారు : చిరంజీవి
గతంలో ఎన్నోసార్లు ఈ మధ్యం గురించి ప్రెస్ మీట్ లు పెట్టానని చెప్పుకొచ్చారు. ఎన్నో వాస్తవాలు కూడా చెప్పుకొచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఏం చేస్తున్నారు?.. ఎలా చేస్తున్నారు?.. అని కూడా ఎన్నో ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు వివరించాం. ఏ విధంగా ప్రజల డబ్బును దోచుకుంటున్నారో తెలిపాం. ఎన్నో ఆధారాలు కూడా ఇచ్చాం.. అయినా మీలో ఏమైనా మార్పు వచ్చిందా?.. అని ప్రశ్నించారు. పాయింట్ 0001% అయినా మార్పు వచ్చిందా అని ఆగ్రహించారు. ఇక్కడ, ఈ బల్ల మీద ఉన్న బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మినవే అని చెప్పుకొచ్చారు. ఇవి ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు.. జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: అమ్మ ప్రాణాన్ని బలి తీసుకున్న కొత్త కారు.. చౌటుప్పల్ వద్ద ప్రమాదం!