
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత నేడు వైసీపీ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యువకులను రౌడీలుగా మారుస్తున్నారు అని ఆరోపించారు. వైసీపీ పార్టీ బాధ్యత లేని పార్టీగా తయారైందని మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు. చిన్న చిన్న పిల్లలతోనే రప్ప.. రప్ప.. అంటూ డైలాగు తో కూడిన ఫ్లెక్సీలు కట్టిస్తూ.. తెలియని వయసులోనే రాజకీయాల్లోకి లాగుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఈ వయసులోనే మేక తలలు నరికి బ్యానర్లకు రక్తాభిషేకాలు చేయిస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తూ ఆనందిస్తున్నారు అని అన్నారు. రాష్ట్రంలో రౌడీ మూకల ఆగడాలను సహించబోము అని తీవ్రంగా హెచ్చరించారు. తాజాగా ఒంగోలులో జరిగినటువంటి పీటీసీలో నూతన కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా హోం మంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కమిట్మెంట్ తో పని చేయాలి అని.. పోలీస్ యూనిఫామ్ అనేది ఒక బాధ్యత అనుకోని ట్రైనింగ్ అవ్వాలని సూచించారు. అలాగే పురుష కానిస్టేబుల్ లకు ఏ మాత్రం తీసుపోని విధంగా మహిళ కానిస్టేబుళ్లు పోలీస్ శాఖలు రాణిస్తూ ఉన్నారు అని వారిని ప్రశంసించారు.
Read also : సర్పంచ్ పాలకూరి రమాదేవి,నరసింహగౌడ్ లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Read also : జనవరి నెలలో సగానికి పైగా సెలవులు.. ఎలా అంటే?





