Friday, February 20, 2026
Homeజాతీయంయువత మేలుకో.. ఈ విషయం పట్ల జాగ్రత్త?

యువత మేలుకో.. ఈ విషయం పట్ల జాగ్రత్త?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. చిన్నచిన్న ఆనందాలని ఇచ్చేటువంటి సందర్భాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఎంత ప్రమాదం అనేది ఎన్నో సందర్భాలలో రుజువు అయింది. ముఖ్యంగా 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలి అని చెప్పి పలు దేశాలు కూడా బ్యాన్ చేశాయి. మరికొన్ని దేశాలు వ్యక్తిగత విషయాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగులు వేస్తున్నాయి. సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ప్రమాదకరంగా మారిపోయింది.

ఒక్కరోజులోనే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క రోజులోనే ఈ సోషల్ మీడియా కారణంగా చనిపోయిన వారు ఉన్నారు. కాబట్టి యువత కొన్ని విషయాలను గమనించాలి. ఈరోజు సోషల్ మీడియాలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు వస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్ లేదా ఇతర ఆధార్, ఓటిపి వంటి కీలక విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఐడెంటిటీ తెఫ్టుకు దారి తీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవసీని కాపాడుకోవడానికి 2 స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ నోట్స్ మొబైల్ ఫోన్స్ లేదా లాప్టాప్స్ వంటి వాటిలో ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments