HomeజాతీయంYouth Congress protest: ఏఐ సదస్సులో నిరసనలు, వారందరూ కటకటాల్లోకి!

Youth Congress protest: ఏఐ సదస్సులో నిరసనలు, వారందరూ కటకటాల్లోకి!

  • ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నిరసన
  • నిరసనకారుల కోసం పోలీసుల గాలింపు
  • ఇంటరాగేషన్‌లో పలువురి పేర్లు వెలుగులోకి

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో వీరంగం చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝళిపించారు. ప్రధానమంత్రి మోడీ, అమెకాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసనలకు దిగిన కార్యకర్తలు అక్కడి నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు. వేదిక దగ్గర   నలుగురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు వారిని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

వీడియో క్లిప్స్ ఆధారంగా నిరసనకారుల గుర్తింపు

భారత్ మండపంలోని 15 వీడియో క్లిప్‌ల ఆధారంగా నిరసనకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, ఇంటరాగేషన్‌లో కొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. అయితే పలువురి ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. నిరసనకారులుభారత్ మండపానికి ఎలా చేరుకున్నారు? అంతకుముందు ఎక్కడున్నారు? ఎప్పుడు ఢిల్లీ వచ్చారు? వాహనాల్లో వచ్చారా? ఆ వాహనాలు ఎవరివి? సమ్మిట్‌లో గొడవకు దిగే ముందు మొబైల్ ఫోన్స్‌ లో ఎవరితో మాట్లాడారు? వాళ్లు ధరించిన టీ షర్టులు ఢిల్లీలో ప్రింటయ్యాయా? బయట ప్రింటయ్యాయా? టీ షర్టుల ప్రింటింగ్‌కు డబ్బులు ఎవరు చెల్లించారు? నలుపు గొడుగుతో మండపంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసిందెవరు? ఈ అల్లర్లు వారి సొంత ప్లానా? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణాల నుంచి పోలీసులు విచారణ ప్రారంభించారు.

తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఈ ఘటనకు సంబంధించి తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. నేరపూరిత కుట్ర, పబ్లిక్ సర్వెంట్‌లను గాయపరచడం, దాడి, చట్ట ఉల్లంఘన, చట్టవిరుద్ధంగా గుమిగూడటం వంటి అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, నిరసనకారులు తొలుత ప్రింటెడ్ సిక్టర్లున్న నలుపు గొడుగులతో మండపంలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేశారని, సెక్యూరిటీ తనిఖీల్లో పట్టుబడే అవకాశాలున్నాయనే కారణంగా వ్యూహం మార్చుకుని ప్రింటెండ్ మెసేజ్‌లు ఉన్న టీ-షర్టులు ధరించాలని నిర్ణయించారని పోలీసులు చెబుతున్నారు.

Read Also: అయ్యో పాపం.. వికటించిన కంటి వైద్యం, ఏకంగా 9 మంది కళ్లు తీసేశారు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments