
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యూరియా విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏదైనా భావి చూసుకొని దూకుమని చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వైరులు అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అవినీతి, మోసాలకు ప్రజలు విసిగిపోయి 11 కిలోమీటర్ల బావి తవ్వి పూడ్చిన కూడా సిగ్గు రాలేదు అని ఫైర్ అయ్యారు. ఎప్పటికప్పుడు తప్పుడు ఫోటోలు తీయిస్తూ… కామెడీగా ఆరోపిస్తుంటే ప్రజలు కూడా నవ్వుతున్నారు.. అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చొరవతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 24 వేల 984 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. ఈ యూరియా మొత్తం కూడా ఈనెల 22వ తారీకు లోపు విశాఖ పోర్టుకు చేరుతుంది అని మంత్రి వెల్లడించారు.
Read also : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్!
కాగా దేశవ్యాప్తంగా రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా యూరియా దొరకక తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా ఇచ్చే స్థలం దగ్గర రైతులు క్యూ లైన్ లో నుంచొని గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం, శ్రీకాకుళం మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గం లో యూరియా కోసం రైతులు గంటలు తరబడి క్యూలైన్లో నుంచుని ఉంటున్నారని… ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ను ప్రశ్నించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో యూరియా కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడలేదని.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే రైతులకు ఎందుకు ఈ ఇబ్బందులు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించగా… మంత్రి అచ్చెన్నాయుడు ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
Read also : ఏపీలో భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు.. రైతులు ఆవేదన!