1988-89 సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జిపఉపాలో చదివి 50 వసంతాలు పూరైన సందర్భంగా ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ 50 వసంతాల వయసు దాటడంతో ఆదివారం మండల కేంద్రంలో 50 వసంతాల ఆత్మీయ కలయికతో పాటు, ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాల్య మిత్రులందరు ఒకచోట కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ,పూర్వ విద్యార్థులందరూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆటపాటలతో, సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న లోడి భాస్కర్ గౌడ్, మొరిపిరాల గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా ఎన్నికైన యాస జనార్దన్ రెడ్డిని ఈ సందర్భంగా బాల్య మిత్రులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులందరికీ జ్ఞాపికలను అందజేశారు.
పదేళ్లు పాలించి పదుల సార్లు ఇదిగో అదిగో అన్నారు : మండల కాంగ్రెస్ పార్టీ
Russian Oil Imports: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు ఉన్నట్టా? లేనట్టా?









