
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా విద్యుత్ చార్జీల రేటు పై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు.
ఇక ఈ బ్యాంకు కనిపించదు.. 4 రోజులు సేవలు బంద్!!!
ఎంపీ మిథున్ రెడ్డి తో పాటుగా ఆర్కే రోజా కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసింది. ‘బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ’ అంటూ రోజా కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెలరేగేలా మండిపడింది. మరోవైపు గ్యారెంటీలు అంటూనే చంద్రబాబుతో సహా పలు నాయకులందరూ కలిసి ప్రజలను మోసం చేశారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ సచివాలయంపై జాతీయ పతాకం అవనతం…వారం రోజుల పాటు అధికారిక వేడుకలు రద్దు
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గరనుంచి వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఎక్కడ లోపం కనిపించినా వెంటనే వైసీపీ నాయకులు వాటిపై తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ లోపాలను నాయకులకు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా కడపలో పాదయాత్ర ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే.