కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయింది. జగన్ రెడ్డి తాడేపల్లి టు బెంగుళూరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అది కూడా చేయడం లేదు. తాడేపల్లికి వచ్చి వారంలో మూడు రోజులు ఉండి ఓ జిల్లా నేతలతో సమావేశం పెట్టి.. బిర్యానీలు, పలావుల గురించి చెప్పేవారు. ఇప్పుడు అది కూడా లేదు. కొన్ని నిరసన కార్యక్రమాలు ప్రకటించి.. తాను మాత్రం పెళ్లిళ్లు, పేరంటాలకు తిరగడంతో వ్యక్తిత్వంపైనే క్యాడర్ కు మళ్లీ మళ్లీ డౌట్లు వచ్చి పడుతున్నాయి. దీంతో మిగతా నిరసనలు రద్దు చేశారు. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
జగన్ హయాంలో ఐదు లక్షల కోట్ల అప్పు!… ఫైరైన అచ్చెన్నాయుడు?
కుమార్తె గ్రాడ్యుయేషన్ కు వెళ్లాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ సీఎం అయిన తొలి రోజుల్లోనే ఓ కుమార్తెను అమెరికాలో.. మరో కుమార్తెను ఫ్రాన్స్ లో చేర్పించారు. ఇప్పటికి ఐదారేళ్లు అవుతోంది. ఇంకా పిల్లల గ్రాడ్యుయేషన్లు అంటూ ఆయన కోర్టును పర్మిషన్లు అడుగుతున్నారు. వారి చదువులేంటో .. అంత సుదీర్గంగా చదువులు జగన్ విదేశీ పర్యటనల కోసమే చదువుతున్నారేమో అనిపించేలా ఉన్నాయి. అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లినా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉన్నా.. పెద్ద తేడా ఉండదని పార్టీ అలా నడుచుకుంటూ పోతుందని ఆ పార్టీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.
కరోనాను మించిన కొత్త వైరస్.. లక్షల్లో కేసులు.. భారత్ లో హై అలెర్ట్
ఈసారి అధికారం పోయిన దగ్గర నుంచి జగన్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు కార్యాచరణ అంటున్నారు, జిల్లాలకు వస్తా అంటున్నారు. రెండు రోజులు ఒక్కో జిల్లాలో ఉంటా.. సంక్రాంతి తర్వాత నుంచే ముహుర్తం అన్నారు. ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇందుకోసం గతంలో ఈగోకు పోయి పాస్ పోర్టు కూడా వద్దనుకున్న ఆయన ఇప్పుడు అవసరం అయితే దిగువ కోర్టుకు హాజరై పాస్ పోర్టు తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. జగన్ తీరుపై వైసీపీ నేతలు పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. సజ్జల ఉన్నాడుగా అని సరి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జగన్ ఇక్కడ ఉన్నా మొత్తం చేసేది సజ్జలే మరి! ఇక వచ్చే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో అనేది మళ్లీ ఆశ్చర్యకరంగా మారిపోయింది.
సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు.. రైతు భరోసాకు కొత్త రూల్స్!