
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ న్యూస్ :- మన దేశ రాజధాని ఢిల్లీ మొన్నటి వరకు కాలుష్యంతో ఉక్కురిబిక్కిరి అవ్వగా నేడు వరదలతో మరోసారి అల్లకల్లోలం అవుతుంది. ఢిల్లీలో ప్రస్తుతం యమునా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఈ యమునా నది ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో ఢిల్లీలోని ప్రజలందరూ కూడా గజగజ వణికి పోతున్నారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటి ప్రవహిస్తుంది. యమునా నది ద్వారా వచ్చేటువంటి వరదలకు మన దేశ రాజధాని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం ఏకంగా 207.48 మీటర్లకు చేరింది. గతంలో నీటిమట్టం ఇన్ని మీటర్లు ప్రవహించడం అనేది రెండుసార్లు మాత్రమే జరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 63 ఏళ్ల తర్వాత ఇది మూడో అత్యధిక ప్రవాహం అని ఢిల్లీ అధికారులు స్పష్టం చేశారు.
Read also : కన్నడ కాంగ్రెస్ లో బీజేపీ ముసలం!
ఈ యమునా నది ఉదృతంగా ప్రవహించడంతో ఇప్పటికే ఢిల్లీలోని పలు ముఖ్య నగరాల్లో నీరు రోడ్లపై నిలిచిపోయింది. సివిల్ లైన్స్, కాశ్మీర్ గేట్ ప్రాంతాల్లో ఏకంగా పెద్ద పెద్ద వాహనాలు అయినటువంటి కార్లు, ఆటోలు నీటిలో మునిగిపోయాయి. భారీ వరదల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీలోని భవనాలు అన్నీ కూడా నీటిలో తేలియాడుతున్నాయి. పలు రకాలుగా ప్రజలు కూడా చాలానే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జాబ్ చేసే వ్యక్తులు.. అలాగే పూట గడవడం కోసం ఆటోలు నడిపేటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వరదల కారణంగా పిల్లలను బడికి పంపాలన్న తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో రాబోయే రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే IMD సూచనలు చేసింది. అత్యవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
Read also : బాలయ్య… మజాకా!.. నిమ్మల రామానాయుడుకి జలక్ ఇచ్చిన బాలకృష్ణ?