
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- సాధారణంగా ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాలలో వింత ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక 34 ఏళ్ల మహిళ ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఇందులో అద్భుతం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా?… అయితే ఇక్కడే దాగుంది అసలైన ఆశ్చర్యకరమైన విషయం. అదేంటంటే ఈ మహిళ జన్మనిచ్చిన మగపిల్లాడు బరువు ఏకంగా 5.2 కేజీలు. దీంతో ఆసుపత్రిలో వైద్యం చేసిన బృందంతో పాటుగా పక్కనున్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ 34 ఏళ్ల మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి రాగా.. అక్కడ వైద్యులు నార్మల్ డెలివరీ సాధ్యపడదు అని చెప్పేసి సిజేరియన్ చేసి పిల్లాడిని బయటకు తీశారు.
Read also ఆకస్మిక గుండెపోటుకు కారణం ఇదే.. ప్రతి ఒక్కరు తెలుసుకోండి?
బయటకు తీసిన పిల్లాడిని చూసి ఆశ్చర్య పోవడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిసారి ఇంత బరువు ఉన్న బాలుడిని దగ్గరుండి చూడడం అని సంబరపడిపోతూ ఆ బాలుడిని తీసుకొని వైద్యులు, స్థానికులు ఫోటోలు తీసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చిస్తున్నారు. ఆ బాలుడిని చూసిన ప్రతి ఒక్కరు కూడా.. ఒక ఏడాది కాలం వయసు ఉంటుంది అనేల భ్రమపడుతున్నారు. సాధారణంగా ఎప్పుడైనా కూడా… పిల్లలు జన్మిస్తే వారి బరువు రెండు కేజీలు లేదా మూడు కేజీల బరువుతో జన్మిస్తూ ఉంటారు. కానీ ఈ బాలుడు ఏకంగా ఐదు కేజీల బరువుతో జన్మించడంతో వైద్య బృందంతోపాటు ఆ బాలుడు తల్లి, దండ్రులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో ఈ బాలుడును చూసిన నెటి జనులు బాల భీముడు పుట్టాడని.. కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇది అద్భుతం అని పొగుడుతున్నారు.
Read also: ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 64వేలు దాటిన మరణాల సంఖ్య