
క్రైమ్ మిర్రర్, అమరావతి:-ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మళ్లీ చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు–గ్రామాల సరిహద్దుల ఖరారు, అవసరమైతే పేర్ల మార్పులు చేయడం, పరిపాలనా సౌకర్యాల కోసం కావాల్సిన సర్దుబాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించనుంది. ప్రజల్లో గందరగోళం లేకుండా ఈ ప్రక్రియ సాఫీగా సాగాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే స్థానిక పరిస్థితులు, ప్రజా ప్రతినిధుల సూచనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
Read also : 11KM బావి తవ్వి పూడ్చిన నీకు సిగ్గు రాలేదు : మంత్రి అచ్చెన్న
అధికార వర్గాల సమాచారం ప్రకారం, అసెంబ్లీ సమావేశాలకు ముందే కమిటీ చర్చలు పూర్తవుతాయి. అనంతరం తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కొత్త జిల్లాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త జిల్లాల రూపకల్పనతో పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే, సరిహద్దుల ఖరారు, పేర్ల మార్పులు, స్థానిక అవసరాలు వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించనుంది.
Read also : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్!