
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- పవన్ కళ్యాణ్ మరియు నిధి అగర్వాల్ కలిసిన నటించినటువంటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎన్నో భారీ అంచనాల నడుమ ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే పవన్ కళ్యాణ్ దాదాపుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి ఒకవైపు జనసేన అభిమానులు మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా థియేటర్లోకి వెళ్లి చూడడానికి ఎగబడుతున్నారు. అయితే తాజాగా ఒక థియేటర్లో చంటి పిల్లలతో కొందరు మహిళలు హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూడడానికి వచ్చారు. అయితే చంటి పిల్లలతో మహిళలు థియేటర్లోకి అడుగుపెట్టగానే పోలీసులు మొహమాటం లేకుండా వెళ్ళిపోమని హెచ్చరించారు.
గత కాలంలో జరిగిన సంఘటనలు మీకు గుర్తు లేదా అని పోలీసులు వారికి గుర్తుచేసి హెచ్చరించి మరీ వెనక్కి పంపించారు. దీంతో చేసేదేం లేక అక్కడికి వచ్చిన మహిళలు చిన్నపిల్లలను తీసుకొని వెనక్కి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు చాలా మంచి పని చేశారని… సోషల్ మీడియాలో చూస్తున్న నెటిజనులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Also Read : రష్యాలో కుప్పకూలిన విమానం, 50మంది దుర్మరణం!
కాగా గతంలో పుష్ప-2 సినిమా విడుదలైన సందర్భంలో ప్రీమియర్ షో జరుగుతున్న టైంలో ఒక మహిళా చనిపోయి తన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై అలాగే థియేటర్ పై కూడా కేసులు పెట్టించి లోపల వేసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాబట్టి ఇలాంటి తరుణంలో అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోలా సినిమాల విషయంలో ఎవరు కూడా ప్రీమియర్ షోలకు చిన్నపిల్లలతో రాకూడదని ఎంత అవగాహన కల్పించినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి ఎవరూ కూడా చిన్నపిల్లలను తీసుకొని స్టార్ హీరోల సినిమాల విడుదలైన ఐదు రోజుల తర్వాత మాత్రమే ధియేటర్లకు వెళ్లాలని చాలామంది అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే విలువైన మనుషులను కోల్పోతామని చెప్తున్నారు.