క్రైమ్

గచ్చిబౌలి యోగా వేడుకల్లో తొక్కిసలాట.. యువతికి సీరియస్

హైదరాబాద్ గచ్చిబౌలి జియంసి బాలయేగి స్టేడియంలో యోగా దినోత్సవం వేడుకల్లో తోక్కిసలాట జరిగింది.
గేట్ నేంబరు 2 దగ్గర బ్రేక్ ఫాస్ట్ పంపిణీ దగ్గర తోపులాట జరగడంతో విద్యార్థులు కిందపడ్డారు. ఈ ఘటనలో మెడికల్ కాలేజ్ విద్యార్థిని నజీమా సృహ కోల్పోయింది. బాధితురాలిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.

వివిధ పాఠశాల , కలశాలల నుండి గచ్చిబౌలి స్టేడియానికి వేలాది మంది విద్యార్థులు వచ్చారు.గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగ వేడుకలు ముగియగానే టిఫెన్ కోసం ఒక్కసారిగా వెళ్లారు విద్యార్థులు. దీంతో గేట్ 2 దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తొక్కిసలాటలో ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button