తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వైద్యం పేరుతో తనను వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాడికూడి శైలేష్ కుమార్ (39)పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యం పేరుతో తనను వేధింపులకు గురిచేసినట్లు ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆదినారాయణ వెల్లడించారు. అనంతరం వైద్యుడు శైలేష్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
also read: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసు.. ఈ నెల 27న సుప్రీంకోర్టులో విచారణ
