
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా డైరెక్టర్ రాజ్ నిడమోరు ను పెళ్లి చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో వీరిద్దరి వివాహం అది కొద్దిమంది అతిధుల మధ్య జరిగింది. మొదటగా అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత విడాకులు తీసుకుని ఇప్పుడు డైరెక్టర్ రాజ్ ను వివాహం చేసుకుంది. అయితే తాజాగా సమంత తన ఇంటి పేరును మార్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం సమంత పూర్తి పేరు ” సమంత రూత్ ప్రభు ” గా ఉండగా ఇప్పుడు కేవలం సమంత అనే బ్రాండ్ పేరుతోనే ముందుకు వెళ్ళనున్నట్లుగా ఆమె నిర్ణయించుకుంది అన్నట్లుగా సినీ వర్గాలు తెలిపాయి. రాజును పెళ్లి చేసుకున్న సమంత అతని ఇంటి పేరును కూడా తన పేరు పక్కన పెట్టడం ఇష్టం లేదని సినీవర్గాలు తెలిపాయి. కాగా నాగచైతన్య నేను పెళ్లి చేసుకున్న తర్వాత అప్పట్లో తన పేరు సమంత అక్కినేని గా ఉండేది. కానీ ఆ తర్వాత పూర్తిగా సమంత అనే బ్రాండ్ నేమ్ తోనే ముందుకు వెళుతుంది. ఈ సందర్భంలోనే ఆమె రాజ్ నిడుమూరు ఇంటిపేరును కూడా జత చేసుకోవడం ఇష్టం లేదని ఉన్నట్లుగా సినీ వర్గాలు ప్రకటించాయి. దీనిపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : ఏడాదికి 50 కోట్ల రెమ్యూనరేషన్.. వారణాసి తో మహేష్ బాబు పంట పండిందిగా?
Read also : పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రేపటి నుంచి వైన్స్ బంద్!





