
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :- తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ది గ్రేట్ డైరెక్టర్ అని చెప్పే డైరెక్టర్ రాజమౌళి నిన్న మహేష్ బాబు సినిమా ఈవెంట్ లో దేవుడిపై కొన్ని కామెంట్లు చేయడం చర్చనీయాంశమయ్యింది. పెద్ద ఎత్తున అభిమానులు నిన్న ఈవెంట్ కు రావడం.. అలాగే మహేష్ బాబు, రాజమౌళి, హీరోయిన్ ఈ సినిమాలో నటించిన పలువురు నటులు కూడా వచ్చారు. సినిమాకి “వారణాసి” అని టైటిల్ అలాగే గ్లింప్స్ ను విడుదల చేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్న సమయంలో హనుమంతుడి పై రాజమౌళి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసి గ్లింప్స్ పదేపదే సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్న సందర్భంలో అసహనానికి గురైన రాజమౌళి నాకు దేవుడిపై ఎలాంటి నమ్మకం లేదు అని.. మా నాన్న ఎప్పుడు హనుమంతుడు మా వెనకాల ఉండి నడిపిస్తాడు అని అంటారు కానీ.. ఆ మాటలు అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చేది అని ఈవెంట్ లో అందరూ చూస్తుండగానే అనడంతో ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజమౌళి హనుమాన్ పై చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయని భక్తులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ టీం వైఫల్యాన్ని దేవుడికి అంట కట్టడం ఏంటని చాలామంది రాజమౌళి పై మండిపడుతున్నారు.
Read also : ఇలా అయితే 50 ఏళ్ళు అయినా బీజేపీ అధికారంలోకి రాదు : బీజేపీ ఎమ్మెల్యే
Read also : Farooq Abdullah: ఢిల్లీలో బాంబు దాడి.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు!





