
చండూరు, క్రైమ్ మిర్రర్:- చేనేత కార్మికులకు, పేద పద్మశాలీయులకు తాను ఎప్పుడు అండగా ఉంటానని బీసీ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాపోలు జయప్రకాష్ అన్నారు. చండూరులో ఆదివారం చేనేత పరిరక్షణ సేవా సమితి (సిపిఎస్), పట్టణ పద్మశాలి సంఘం మార్గదర్శకత్వంలో నిర్వహించిన ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన స్వగ్రామానికి అన్ని విధాలా సేవలందిస్తానని తెలిపారు. తన చిన్ననాటి మిత్రులను గుర్తు చేసుకున్నారు. చేనేత సమస్యల పైన ఇప్పటికే తాను అనేక వినతి రూపంలో ప్రభుత్వానికి అన్ని వివరించానని తెలిపారు. ఇంకా వివరించడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. కార్మికులు పద్మశాలలకు ఏమన్నా సమస్య వస్తే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పైన పెద్దలంతా కూర్చొని ఓ వినతి రూపంలో తనకి ఇవ్వాలన్నారు.
విజయవాడ “సృష్టి” ఫెర్టిలిటీ సెంటర్‌పై పోలీసుల ఆరా…ముగ్గురు వైద్యులు అజ్ఞాతంలోకి
ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య, గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు దేవా, మార్కండేయ దేవాలయం మాజీ అధ్యక్షుడు పున్న బిక్షమయ్య , చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు ఏలే శ్రీనివాస్, సంగెపు శ్రీనివాస్, రాపోలు జగదీష్, నగేష్, వర్కాల నవీన్, మార్కండేయ యువజన సంఘం నాయకులు చిలుకూరు మణికుమార్, కలిమికొండ కిరణ్,కర్నాటి రవి, ఏలే శేఖర్, చిటిప్రోలు వెంకటేశం, చెరుపల్లి అంజయ్య, సందీప్ మల్లేష్, వర్కాల విజయ్, రాఘవేంద్ర, తిరందాసు ఆంజనేయులు, తిరందాసు బిక్షం, శివరాజు, చెరుపల్లి వేణు కుమార్, చిట్టిప్రోలు మహేష్, చెరుపల్లి శ్రీను, తిరందాసు ఆంజనేయులు, నగేష్, రమేష్, శ్రీనివాస్,రవి, మల్లేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో స్పెర్మ్ సేకరణ క్లినిక్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు