
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా రాబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ను దక్కించుకునేందుకు ఏకంగా 600 కోట్ల రూపాయల వరకు చర్చలు జరుగుతుందన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ డీల్ ఫిక్స్ అయిందంటే భారతీయ చలనచిత్రాల్లో ఇదే అత్యధిక రికార్డు సృష్టించడం ఖాయం. కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లుగా అలాగే వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లుగా ఇప్పటికే సినీ వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రతి ఒక్కరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 తో పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాతో మరింత ఎదుగుతారా?.. లేక పడిపోతారా?.. అనేది వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా కథ కూడా ఇప్పటివరకు ఎక్కడ చూసి ఉండరు అని.. కచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అని డైరెక్టర్ అట్లీ చెప్పిన విషయం తెలిసిందే.
Read also : తెలంగాణలో మరో 4 గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
Read also : వచ్చే మార్చి నెలలోనే అల్లు శిరీష్ వివాహం..?





