క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిది: తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను అతికిరాతకంగా హతమార్చిన ఘటన మాడుగులపల్లి మండలం, సీత్యాతండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది..
స్థానికులు తెలిపిన వరాల ప్రకారంగా…నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలము సీత్యతండ గ్రామానికి చెందినా రామవాత్ రవి,లక్ష్మి దంపతులు, రామవాత్ రవి వేములపల్లి మండలము సల్కునూరు గ్రామంలోని PACS కార్యాలయంలో విదులు నిర్వహిస్తూ ఉండేవాడు, భార్య లక్ష్మి ఇంటి వద్దే ఉండేది.
అయితే గత కొన్ని రోజులుగా భార్య లక్ష్మి వ్యవహార శైలిలో మార్పులు గమనించిన భర్త రవి ఆమెను మండలిన్చేవాడు, గత సంవసరం క్రితం లక్ష్మి తన ప్రియుడు తో కలిసి ఉండడం చూసి ఆమెను మందలించేవాదు అన్నారు. ఐన భార్య లక్ష్మి మారకపోవడంతో తరాసు వీరిద్దరి కాపురంలో వివాహేతర సంబంధం కారునంగా గొడవలు జరుగుతువుండేవి అన్నారు.
అయితే భార్య లక్ష్మి నా అక్రమ సంబందానికి భర్త రవి అడ్డువస్తున్నాడు అని ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో పన్నాగం పన్నింది. తన ప్లాన్ ప్రకారం భర్త రవిని బుదవారం అతి కిరతంకంగా చంపింది. అనంతరం పోలీస్ ల వద్దకు వెళ్లి నేరం ఒప్పుకొని లొంగిపోయింది అన్నారు.
గ్రామస్తులు వచ్చి చూసేసరికి మృతుడు రవి అతడి ముక్కులోంచి రక్తం కారి చనిపోయ్యి వున్నాడు, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా తండాలో విశాదచాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనతో ఎలాంటి అవన్చనియ ఘటనలు జరగకుండా లక్ష్మి ప్రియుడుని పోలిసులు అదుపులోకి తిసుకునట్లు సమాచారం. ఈ ఘటన పై పోలిసుసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





