HomeతెలంగాణMangli: తరచూ వివాదాలు.. అసలు మంగ్లీకి ఏమైంది?

Mangli: తరచూ వివాదాలు.. అసలు మంగ్లీకి ఏమైంది?

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: చాలామందికి ఇట్టే అవకాశాలు వస్తాయి. కానీ నిలబెట్టుకునేది కొందరు మాత్రమే. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకొని కొంతమంది అభివృద్ధి సాధిస్తుంటారు. మరికొందరు చేజేతులా పోగొట్టుకుంటారు. ఈ జాబితాలో సింగర్ మంగ్లీ ముందుంటారు. వరుస వివాదాల్లో చిక్కుకొని మరింత వివాదాస్పదం అవుతున్నారు. మొన్న ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీ జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపై కేసు నడుస్తుండగా.. తాజాగా ఆర్థికపరమైన వివాదం వచ్చి ఆమెపై పడింది. దీంతో మరోసారి వివాదాస్పదం అయ్యారు సింగర్ మంగ్లీ.

మంచి గుర్తింపు..

తనదైన ప్రత్యేక వాయిస్తూ ఎంతో గుర్తింపు సాధించారు మంగ్లీ. ఎన్నో సూపర్ హిట్ పాటలు కూడా పాడారు. కానీ ఆమె పాటలు రాజకీయం అయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పాటలు పాడడమే కాదు ఏకంగా ఆమె ప్రచారం కూడా చేశారు. దీంతో ఆమెపై రాజకీయ ముద్రపడింది. వచ్చిన అవకాశాలు కూడా రాకుండా మానేసాయి. వైసిపి హయాంలో ఆమెకు టీటీడీ భక్తి ఛానల్ లో ఒక పదవి కూడా కట్టబెట్టారు. అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత ఆమె తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది.

పాటలు సైతం వివాదం..

సింగర్ మంగ్లీ పాడిన పాటలు కూడా వివాదాస్పదం అవుతూ వచ్చాయి. మొన్న ఆ మధ్యన ఆమె పాడిన బావిలోనే బల్లి పలికే అనే పాట వివాదంలో చిక్కుకుంది. ఓ భాషలో పాపులర్ అయిన పాటను అదే మాదిరిగా తెలుగులో దించేసారని.. యూన్స్ కూడా అవే వాడారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై మంగ్లీ మాత్రం స్పందించలేదు. సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతూ ఉంది. మరోవైపు బాలీవుడ్ లో సైతం ఓ పాటను పాడారు మంగ్లీ. ఆ పాట సైతం తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. దీంతో ఆ పాటను ఆ చిత్రం నుంచి తొలగించాల్సి వచ్చింది. మంగ్లీ క్షమాపణలు కూడా కోరింది. ఇప్పటికీ ఆ పాటకు సంబంధించిన కేసు జాతీయ మహిళా కమిషన్ విచారణ పరిధిలో ఉంది.

మైక్రో ఫైనాన్స్ పేరుతో..

అయితే ఇటీవల మంగ్లీ కొంతవరకు సైలెన్స్ పాటిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ఆమె పేరు మళ్లీ మీడియాలో మార్మోగిపోతోంది. మంగ్లీ తో పాటు ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల బై పంజాగుట్టలో కేసు నమోదయింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీ, లాభాలు ఇస్తామని చెప్పి ఆ ముగ్గురు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారట. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే దౌర్జన్యానికి దిగారట. అంతేకాదు ఓ న్యాయవాదిని కారుతో బుద్ధి చంపుతామని బెదిరిస్తున్నారట. దీంతో సదరు న్యాయవాది పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది మంగ్లీకి. తనకు ఏ పాపం తెలీదంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఇలా తరచూ మంగ్లీ వివాదాస్పదం అవుతుండడంతో ఆమెకు సినీ అవకాశాలు సన్నగిల్లే ఛాన్స్ కనిపిస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు