
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- పులివెందుల ఫైట్ రాక రేపుతోంది. జగన్ అడ్డాలో ఎగిరే జెండా ఎవరిది…? రెండు జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచేదెవరు..? ఫ్యాను గాలి వీస్తుందా…? సైకిల్ సత్తా చాటుతుందా…? వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ఈ బైఎలక్షన్ ఉత్కంఠ రేపుతోంది.కడప జిల్లా.. అందులోనూ పులివెందుల… దీంతో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి ఫైట్ జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ కనుక.. ఉపఎన్నికలు జరగబోతున్న రెండు జెడ్పీటీసీలను ఎలాగైన గెలిచి తీరాలని.. పక్కా వ్యూహాలతో ముందుకువెళ్తోంది. జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగరకూడదన్న పట్టుదల వైసీపీలో కనిపిస్తోంది. దీంతో నువ్వా నేనా అన్న ఫైట్ పులివెందులో కనిపిస్తోంది. అంతేకాదు.. దాడులు, హత్యాయత్నాలు కూడా జరుగుతున్నాయి. వైసీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నా… తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది ఆ పార్టీ కేడర్. ఈనెల (ఆగస్టు) 12న జరగనున్న ఈ ఉపఎన్నికల్లో గెలుపెవరిదో చూడాలి.
Read also: రాజగోపాల్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు – కాంగ్రెస్ పార్టీలో టెన్షన్..?
2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాలకు.. వైసీపీ 49 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీకి ఒకే ఒక్క జెడ్పీటీసీ (అట్లూరి) స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత.. 8 మంది జెడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీచైర్మన్‌గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి.. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో… ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇక.. పులివెందుల జెడ్పీటీసీ అయిన మహేశ్వర్‌రెడ్డి ఇటీవల రోడ్డుప్రమాదంలో మరణించారు. దీంతో.. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు ఇప్పుడు బైఎలక్షన్ జరుగుతోంది.
Read also : డేంజర్‌లో సింగూరు డ్యామ్.. ఎప్పుడైనా గండి పడొచ్చు?
ఈ రెండింటిలో.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికే ఎక్కువగా కాకరేపుతోంది. ఈ స్థానం నుంచి రోడ్డుప్రమాదంలో మరణించిన జెడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి కుమారుడు హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక.. టీడీపీ.. బీటెక్ రవి భార్య లతారెడ్డిని నిలబెట్టింది. దీంతో.. పులివెందులలో టఫ్ ఫైట్ నడుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టారు. జిల్లా నేతలతో చర్చించి.. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలాగైన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలిచి తీరాలని నేతలకు ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. దీంతో.. గెలుపు కోసం అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ క్యాడర్.
Read also : డేంజర్‌లో సింగూరు డ్యామ్.. ఎప్పుడైనా గండి పడొచ్చు?
పులివెందుల జెడ్పీటీసీని కైవసం చేసుకుని… జగన్ ఇలాకాలో పైచేయి సాధించాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరోవైపు… పులివెందులలో గెలిచి చూపించి.. రాష్ట్రంలోనూ రాబోది తమ ప్రభుత్వమే అనే సంకేతాలు పంపాలని వైసీపీ భావిస్తోంది. మండలస్థాయిలో జరిగే ఎన్నికల కావడంతో.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. మరి పైచేయి ఎవరిదో….? పులివెందులలో ఎవరు జెండా పాతుతారా..? చూద్దాం.
Read also : మేం మునిగితే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్