
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- క్రికెట్ చరిత్రలో జెర్సీ నెంబర్ 18 అనగానే ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా విరాట్ కోహ్లీ అనే చెప్తారు. అయితే నేడు టీమిండియా అండర్ 19 జట్టులో ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీ జెర్సీ మీద 18 నెంబర్ వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించాడు. కేవలం ఆటతోనే కాకుండా తన జెర్సీ మీద 18 నెంబర్ ఉండడంతో చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం వైభవ్ సూర్యవంశి పై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిసారి అతని ఆటను చూసేటువంటి క్రికెట్ ప్రేక్షకులు ఈసారి మాత్రం వైభవ్ సూర్యవంశి ధరించినటువంటి జెర్సీ ని చూస్తూ ఎవరికి వారు నచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. నెంబర్ 18 జెర్సీని ధరించి క్రికెట్ ఆడడాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం వైభవ్ సూర్యవంశీ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.
విరాట్ కోహ్లీ పూర్తిగా అన్ని ఫార్మాట్లకు రిటైర్ ఇచ్చిన తరువాతే ఈ నెంబర్ జెర్సీని ఎవరైనా ఉపయోగించాలని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అన్ని ఫార్మేట్లకు రిటైర్ అయ్యేంతవరకు ఈ జెర్సీని ఎవరు ధరించకూడదని మండిపడుతున్నారు. మరి కొంతమంది విరాట్ కోహ్లీ ఫాన్స్ మాత్రం.. ఈ నెంబర్ 18 జెర్సీ ని భవిష్యత్తులో కూడా ఎవరికి ఇవ్వకూడదని… అలా చేస్తే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను అవమానించినట్లేనని చెప్పుకొస్తున్నారు. చాలామంది విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18ని పూర్తిగా క్రికెట్ లోనే రిటైర్ చేయాలని… భవిష్యత్తులో ఎవరికీ కూడా 18 నెంబర్ జెర్సీని ఇవ్వకూడదని ఏకంగా బీసీసీఐకే అపీల్ చేస్తున్నారు. భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని క్రికెట్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ సాధించిన ఎన్నో విజయాలకు ప్రతీక ఈ నెంబర్ 18 జెర్సీ అని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు. కాబట్టి ఆ నెంబర్ 18 జెర్సీకి ఎప్పుడు కూడా మనం గౌరవం ఇవ్వాలని… విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరూ కూడా ఫుల్ ఫిల్ చేయలేరని వాదిస్తున్నారు. నెంబర్ 18 జెర్సీ వేసుకున్న విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు మన భారతదేశానికి సాధించి పెట్టాడని అంటున్నారు. దీంతో వైభవ్ సూర్యవంశీ ఈ నెంబర్ జెర్సీ వేసుకోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యవంశీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా 18 నెంబర్ జెర్సీ ని వేసుకోకూడదని కామెంట్లు చేస్తున్నారు.