
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- పర్సనాలిటీ రైట్స్.. ఈ పదం దేశవ్యాప్తంగా కొంతమందికి తెలిసినా చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పర్సనాలిటీ రైట్స్ అంటే ఎవరైనా సరే ప్రముఖ వ్యక్తులు తమ నేమ్, ఇమేజ్ మరియు వాయిస్ వంటివి తన అనుమతి లేకుండా ఇతరులు ఎవరూ కూడా ఆర్థికంగానూ అలాగే అవమానించేలా సోషల్ మీడియాలో వాడుకోకుండా ఈ పర్సనాలిటీ రైట్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఈ పర్సనాలిటీ రైట్స్ పొందిన వ్యక్తులు తమ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలను గాని లేదా వీడియోలను కానీ పోస్ట్ చేయలేరు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టు మెట్లు ఎక్కారు.
Read also : Mallya London Party: భారత్ నుంచి పారిపోయిన పెద్దలు, బర్త్ డే పార్టీలో ఎంజాయ్!
అయితే నేడు ఒక భారత క్రీడాకారుడు ఈ పర్సనాలిటీ రైట్స్ పొందారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తన పేరు, ఫోటోలు మరియు వాయిస్ ను ఎవరైనా సరే అనుమతి లేకుండా వాడకూడదు అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గవాస్కరు పేరు గాని లేదా ఫోటోలు గాని తప్పుగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అతనికి సంబంధించినటువంటి అనుమతి లేని పోస్టులు అలాగే వీడియోలను 72 గంటల్లో తొలగించాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా కొన్నేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయి వంటి వారు ఈ పర్సనాలిటీ రైట్స్ పొందారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ అలాగే ఎన్టీఆర్ కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ కోసం ఢిల్లీ కోర్టులకు వెళుతూ ఉన్న సందర్భాలు చూస్తున్నాం.
Read also : Bahubali Rocket: బ్లూబర్డ్ బ్లాక్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. నేడే ఎల్వీఎం-3-ఎం6 రాకెట్ ప్రయోగం





