
తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టించారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రిపదవి విషయంలో కొంత కాలంగా హాట్ కామెంట్స్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి.. మరోసారి సొంత పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత సీనియర్ అయిన మాజీ మంత్రి జానారెడ్డి పై ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదన్నారు. తన లాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారని కొందరు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అన్నారు. ఇండియా క్రికెట్ టీంలో అన్నదమ్ముళ్లు ఉన్నప్పుడు.. కేబినెట్ లో ఉంటే ఏమవుతుందని ప్రశ్నించారు. మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని.. కెపాసిటిని బట్టి వస్తుందని తెలిపారు. తనకు మంత్రి పదవి విషయంలో జానా రెడ్డి లాంటి దుర్మార్గులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గల్ల ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే పొజిషన్ లో ఉండడని తేల్చి చెప్పారు.
Also Read : రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి జానారెడ్డి చెక్! తెరవెనుక సీఎం రేవంత్ రెడ్డి?
30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇంచార్జీ బాధ్యతలు ఇస్తే ఎంపీలను గెలిపించలేదన్నారు. ఒక ఎమ్మెల్యేగా తాను భువనగిరి ఎంపీని గెలిపించా చూపించానని చెప్పారు.
తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి, కొందరు దుర్మార్గులు దృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పోసిషన్లో ఉండడని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
-
తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.
-
మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని?
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?
-
ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..