ఐపీఎల్ 2025 కు సంబంధించి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ప్లేయర్స్ రిటైన్ జాబితాలనైతే అక్టోబర్ 31 వ తారీఖున విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటర్న్షన్ లిస్టు నిన్న విడుదల చేయగా అందరికంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ 110 కోట్లతో మెగా వేళానికి సిద్ధమయ్యింది. అయితే ఈ రిటర్న్షన్లకు ముందు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్లాసన్ కు ఏకంగా 23 కోట్లు వెచ్చించి మరీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైన్ చేసుకున్నారు. మరోపక్క విరాట్ కోహ్లీ నీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం 21 కోట్లతో సొంతం చేసుకుంది.
రిటైన్కు ముందు విరాట్ కోహ్లీ అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. అలాగే నీకోలెస్ పూరన్ 21 కోట్లు పెట్టి మరి రిటైన్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, జస్పీత్ బుమ్రా, సంజు సాంసంన్, జై స్వాల్, రషీద్ ఖాన్, కమీన్స్ 18 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. ఇక అక్షర పటేల్ మరియు శుభమన్ గిల్ 16.5 కోట్లకు రిటైన్ చేసుకుని వీళ్ళందరూ కూడా అత్యధిక ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు.