
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-టీమిండియా యంగ్ ప్లేయర్, సిక్సర్ల వీరుడు అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే అనిపిస్తుంది. ఒకప్పుడు సిక్సర్ల వీరుడు అంటే టీమిండియాలో యువరాజ్ సింగ్ పేరు మొదటగా ప్రతి ఒక్కరు ప్రస్తావించేవారు. ఇక యువరాజ్ సింగ్ శిక్షణలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి అభిషేక్ శర్మ ఇప్పుడు ప్రత్యర్థి జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక తాజాగా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య నిన్న మూడో టి20 జరగగా అందులో కేవలం 14 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశారు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ తన ఇన్స్టా వేదికగా స్పందిస్తూ “12 బంతుల్లో 50 చేయలేకపోయావు.. సరేలే బాగా ఆడావు” అంటూ ట్విట్ చేశారు. యువరాజ్ సింగ్ సరదాగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులు అందరూ కూడా పోస్టులు చేసి వైరల్ చేస్తున్నారు. భారత జట్టు తరఫున అతి తక్కువ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ప్రస్తుతం యువరాజ్ సింగ్ పేరిటనే ఉంది.
Read also : ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Read also : హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయి.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు?





