
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్టు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ టెస్టులో భాగంగా సౌత్ ఆఫ్రికా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంటే టీమిండియా మాత్రం ఘోరంగా విఫలమౌతూ వస్తుంది. సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 489 పరుగులు చేసి ఆల్ అవుట్ అవ్వగా… భారత్ 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైష్వాల్ 58 పరుగులతో రాణించినా కూడా.. మిగతా ప్లేయర్లు అందరూ తేలిపోయారు. రాహుల్ 22, సాయి సుదర్శన్ 15, దృవ జూరల్ 10, పంత్ 7, నితీష్ కుమార్ రెడ్డి 10, రవీంద్ర జడేజా 6 ఇలా వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ప్రస్తుతం గ్రీస్లో వాషింగ్టన్ సుందర్ 19, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో ఉన్నారు. టెస్టులో మన బ్యాట్స్మెన్ల ఆటను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇలా ఆడితే భవిష్యత్తులో టెస్టు రికార్డ్స్ కూడా మాయం అవుతాయి అని కామెంట్లు చేస్తున్నారు. సెలక్టర్లు కూడా ఎవరైతే ఫామ్ లో ఉన్నారో వారిని కాకుండా టెస్ట్ ఫార్మేట్ కు సంబంధించి ప్రత్యేకమైన టీం ను పక్కకు తీయాలి అని చెప్తున్నారు.
Read also : ఆపద వస్తే నేను ఉన్నానంటున్నా నకిరేకంటి మురళి కృష్ణ
Read also : Apk ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీఎస్పీ శ్రీధర్ రెడ్డి





