Homeక్రైమ్వైరాలో భారీగా గంజాయి పట్టివేత

వైరాలో భారీగా గంజాయి పట్టివేత

  • గంజాయి విలువ రూ. 67.20ల‌క్ష‌లు

ఖమ్మం, క్రైమ్ మిర్ర‌ర్: ఖ‌మ్మం జిల్లా వైరాలో గుట్టు చ‌ప్పుడు కాకుండా కారులో త‌ర‌లిస్తున్న గంజాయిని ప‌ట్టుకొని సీజ్ చేశారు. ఒడిసా నుంఇ హైద‌రాబాద్‌కు అక్ర‌మంగా ర‌వాణ అవుతున్న 101.2 కిలోల ఎండు గంజాయితీతో పాటు 2.7కిలోల హాసీష్ ఆయిల్‌ను పోలీసులు ప‌ట్టుకొని స్వాధీనం చేస‌కున్నారు.

ఖమ్మం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ అనుమానాస్పదంగా ఉన్న హర్యానా నెంబర్ ప్లేట్ కలిగిన కారును ఆపి చెక్ చేయ‌గా గంజాయి, హాషిష్ ఆయిల్ బ‌య‌ట‌ప‌డింది. గంజాయి ర‌వాణ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన మహమ్మద్ అస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.

కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైరా ఎక్సైజ్ స్టేషన్‌కు నిందితుడిని అప్పగించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు 67.20 లక్షల రూపాయలుగా తెలుస్తోంది.

తాజావార్తలు