
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
సాధారణంగా క్రికెట్ ఆడేటప్పుడు టాయిలెట్ వస్తే ఎలా అని చాలామందికి ఒక ప్రశ్న అయితే మదిలో మెదులుతూ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే కాలకృత్యాలు అన్ని తీర్చుకుని… స్టార్ట్ అయ్యే అరగంట ముందే మ్యాచ్ కు సిద్ధంగా ఉంటారు. క్రికెటర్లు మైదానంలో అటు ఇటు పరిగెడుతూ చాలా యాక్టివ్ గా ఉంటారు కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు మొత్తం చెమట రూపంలోనే బయట వస్తూ ఉంటుంది. ఒక ఫీల్డర్ కు అనుకోకుండా సడన్గా టాయిలెట్ వస్తే సబ్క్యూట్ గా వేరే ప్లేయర్ వస్తాడు కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. మరోవైపు బ్యాట్స్మెన్ అయితే యూరిన్ వస్తే డ్రింక్స్ బ్రేక్ లో వెళ్లి వస్తారు. అలాకాకుండా ఇన్నింగ్స్ మధ్యలో వస్తే మాత్రం కచ్చితంగా ఎంపైర్ పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దాదాపు సహజంగా జరిగే పరిణామాలు అయినప్పటికీ క్రికెటర్స్ ఎంతో యాక్టివ్ గా ఎప్పుడు ఏ పని చేయాలో వారికి ముందుగానే తెలిసి ఉంటుంది. కాబట్టి ఇలా మధ్యలో టాయిలెట్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. మ్యాచ్ కు ముందుగానే ప్రతి ఒక్కరు కూడా కాలకృత్యాలు తీర్చుకునే మైదానంలోకి అడుగు పెడతారు. ఒకవేళ సడన్ గా టాయిలెట్ వస్తే మాత్రం ఇక ఎంపైర్ ని అడిగి పరిమిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో వారు డ్రింక్స్ బ్రేక్ లేదా ఏదో ఒక కారణంగా బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఇలా ఏమైనా జరిగితే మధ్యలో ఎంపైర్లను అడిగి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రికెట్ అనే కాదు వేరే ఏ ఆటలు అయినా సరే ఆడుతున్న సమయంలో ఎన్నో వింత విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
Read also : ఒక్కొక్క కుటుంబానికి 3000 రూపాయలు, 25 కేజీల బియ్యం : సీఎం
Read also : వీధి కుక్కల వ్యవహారం.. అన్ని రాష్ట్రాల పై మండిపడ్డ సుప్రీంకోర్టు





