
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు నిజామాబాద్ పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు నిజామాబాద్ లో “జనం బాట” అనే కార్యక్రమం నిర్వహించారు కవిత. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటికైనా నిజామాబాద్ గడ్డలోని కలిసి పోతాను అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా తన తండ్రి కెసిఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశాను అని తెలిపారు. కానీ చివరికి కుట్ర చేసి పార్టీ నుంచి బయటకు పంపించేశారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అవమానాలు జరిగినా కూడా భరించా.. కానీ ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఇప్పుడు మీ మద్దతుతో నా దారి నేను వెతుక్కుంటున్నా.. నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా?.. కాదా?.. అని ప్రశ్నించారు. పార్టీ తరపున, వ్యక్తిగతంగా ఎన్నో అవమానాలు జరిగినా కూడా నా తండ్రికి కేసీఆర్ గారి నీడలోనే ఇన్నాళ్ళు ఉన్నాను అని… కానీ కొన్ని కారణాలవల్ల ఆ నీడలో నుంచి నన్ను బయటకు నెట్టేశారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు కవిత. నిజామాబాద్ జిల్లా అంటేనే అన్ని ఉద్యమాలకు, అన్ని భావాజలాలకు మొదటి వరుసలో ఉంటుంది. నేను ముందడుగు వేసి పార్టీని ఎక్కడ ఏమీ అనలేదు, నిందించలేదు, పార్టీకి వ్యతిరేకంగా ఏమి చేయకపోయినా కూడా నన్ను బయటకు నెట్టేశారు అని అన్నారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
Read also : బ్రేకింగ్ న్యూస్… స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు?
Read also : ఇది పాఠశాల అంటే ఎవరు నమ్మరు…అధికారులు ఉన్నారా..? లేరా..?





