Monday, February 16, 2026
Homeఆంధ్ర ప్రదేశ్మెరుగైన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాం

మెరుగైన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాం

  • వైసీపీ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం
  • పార్టీ ఎమ్మెల్యేల‌కు వార్నింగ్‌
  • సీఎం చంద్ర‌బాబు నాయుడు

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్: ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో మీడియా చిట్‌చాట్‌లో ప‌లు అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. మీరు మార‌క‌పోతే మీకే న‌ష్ట‌మ‌ని ఎమ్మేల్యేల‌కు వార్నింగ్ ఇచాచ‌రు. 95-96 మాదిరిగానే ఈసారి నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని తెలిపారు . రాష్ట్రంలో సమస్యలు అయితే మాత్రం ఇంకా చాలా ఉన్నాయ‌న్నారు. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందన్నారు.

కేంద్రం సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామ‌న్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని ఆకాంక్షించారు.సేవా రంగంలోనూ ఆదాయం మరింత పెరగాలన్నారు. రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని పేర్కొన్నారు. అమరావతి రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందన్నారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే అన్నారు. హార్టికల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు కేటాయించడం బాగుందని తెలిపారు.

రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదన్న ఆయన‌ పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయన్నారు. 2014 – 19 మధ్య కూడా రైన్ గన్స్ తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేదన్నారు. అప్పుడే హంద్రీనీవాను సీరియస్ గా తీసుకున్నామన్నారు. దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయన్నారు. రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక వారి పని తీరుకు నిలువుటద్దమని తెలిపారు. నేను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటా మారకపోతే వాళ్లకే నష్టమని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments