
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- మన రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా రాజకీయ ప్రస్తావనలు విస్తృత స్థాయిలో జరుగుతున్న వేళ.. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారిపోయాయి. అధికార పార్టీలో ఎవరు ఉన్న కూడా తమ వెంట ఉండాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది రెడ్డి అయినా.. లేదా రావు అయినా.. మేము ఎవరికి అనుచరులం కాదు అని చెప్పారు. వారందరూ మా వెనకాలే వస్తారు.. వారితో ఎలాంటి పనులు చేయించుకోవాలో మాకు స్పష్టంగా తెలుసు అని తాజాగా జరిగిన ఒక సభలు అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు. అయితే గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సన్నిహితంగా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి స్నేహంగా ఉంటుంది. దీంతో అధికారంలో ఏ పార్టీ ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. దీంతో ఈ ఎంఐఎం ఎమ్మెల్యే అభివృద్ధి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిపోయాయి.
Read also : ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మానసిక స్థితి సరిగా లేదు : ఇమ్రాన్ ఖాన్
Read also : KCR ను జైల్లో వేస్తామని మీకు చెప్పామా.. రేవంత్ కు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి!





