Homeఅంతర్జాతీయంయుద్దం ఎఫెక్ట్‌...ఆ దేశానికి విమాన సేవ‌లు ర‌ద్దు...!

యుద్దం ఎఫెక్ట్‌…ఆ దేశానికి విమాన సేవ‌లు ర‌ద్దు…!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్‌: ప‌శ్చిమాసియాలో యుద్దం రోజు రోజుకు తీవ్ర‌త‌రం అవుతునేప‌థ్యంలో ఎయిరిండియా కీల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇరాన్‌-ఇజ్రాయెల్ యుద్దం నేప‌థ్యంలో మే 31 వ‌ర‌కు విమాన సేవ‌ల‌ను నిలిపివేస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఈ విష‌యాన్ని ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ ధ్రువీక‌రించారు. న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వ‌ర‌కు ఈ స‌ర్వీసులు మే 31 నిలిపి వేయ‌నున్నారు. ఎయిరిండియా తీసుకున్న నిర్ణ‌యంతో ఇజ్రాయెల్‌లో ఉన్న 40వేల మంది వివిధ ఉద్యోగ‌రీత్య అక్క‌డ ప‌ని చేస్తున్నారు. దీంతో విరిపై ప్ర‌భావం ప‌డ‌నుంది.

యుద్ద కార‌ణాల‌తో ఇజ్రాయెల్‌ను వీడి స్వ‌దేశానికి రావాల‌ని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్లిస్ట‌స‌మ‌యంలో ఎయిరిండియా స‌ర్వీసులు ర‌ద్ద‌వ‌డం వ‌ల్ల వారిని ఇబ్బందుల్లో ప‌డేయ‌నుంది. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని సంస్థలు మాత్రమే కఠిన ఆంక్షల మధ్య వివిధ దేశాలకు విమానాలను తిప్పుతున్నాయి. గత జనవరి నెలలోనే న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్‌కు డైరెక్ట్ ఫ్లైట్‌ సర్వీసులను ఎయిర్ ఇండియా మొదలుపెట్టింది.

ఇందుకోసం అత్యాధునికమైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. అయితే, ఊహించని విధంగా ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అవటంతో మొత్తానికి ఇజ్రాయెల్‌కు వెళ్లే సర్వీసులే రద్దయ్యాయి. శనివారం ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జేపీ సింగ్, ఎంబరీ సిబ్బంది ఇజ్రాయెల్‌లో ఉన్న పలువురు భారతీయులతో వర్చువల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments