
విశాఖలో కూటమి పార్టీలు చక్రం తిప్పాయి. అనుకున్నది సాధించాయి. కొన్ని నెలలుగా నడుస్తున్న రాజకీయాలకు తెరదించాయి. విశాఖ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో… జీవీఎంసీ పీఠం కూటమి వశమైంది. వైసీపీకి చెందిన బీసీ మహిళ… కన్నీళ్లు పెట్టుకుంటూ.. కుర్చీ నుంచి దిగిపోయారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి… జీవీఎంసీపై కన్నేసింది. అక్కడి వైసీపీ కార్పొరేటర్లను బుజ్జగించో… బెదిరించో… తమ వైపు తిప్పుకుంది. మేయర్‌గా హరివెంకటకుమారి నాలుగేళ్లు పూర్తి చేసుకునేంత వరకు ఓపిక పట్టి.. సమయం రాగానే అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసం పెట్టినప్పటి నుంచి విశాఖలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అటు కూటమి… ఇటు వైసీపీ… తమ తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా… విదేశాలకు తరలించింది. అనుకున్నది సాధించింది.
Also Read : ఎకరం భూమి 99 పైసలే!… ప్రముఖ ఐటీ కంపెనీకి కట్టుబెట్టిన ఏపీ ప్రభుత్వం
కలెక్టర్ హరేంద్రప్రసాద్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నుంచి 74 మంది సభ్యులు హాజరయ్యారు. మేయర్‌పై అవిశ్వాస తీర్మానం గెలవాలంటే 74 మంది సరిపోతారు. అంటే… కూటమికి మెజార్టీ సరిపోయింది. దీంతో… వైసీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. కూటమికి సరిపడా బలం ఉండటంతో….. మేయర్ అవిశ్వాసం నెగ్గింది. మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకుంది. ఇప్పుడు.. విశాఖ మేయర్ అభ్యర్థి ఎవరు అన్న దానిపై జరుగుతోంది.
2021లో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధికంగా 58 వార్డులు గెలుచుకున్న వైసీపీ… హరివెంకట కుమారిని మేయర్ పీఠం ఎక్కించింది. నాలుగేళ్లు పదవిలో ఉన్న ఆమెపై… అవిశ్వాసం నెగ్గడంతో దిగిపోయారు. అయితే… పదవీ కాలం ఇంకా 10 నెలలు ఉంది. ఈ 10 నెలలకు గాను.. ఎవరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలా..? అని కూటమి పార్టీలు ఆలోచిస్తున్నాయి. విశాఖ కొత్త మేయర్ రేసులో టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు పేరు ముందు వరసలో ఉంది. అధిష్టానం పేరు ఖారారు చేసేసిందని… ఆయన ఎన్నిక లాంఛనమే అని అంటున్నారు. పీలా శ్రీనివాసరావు… అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ సోదరుడు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామక్రిష్ణకు బంధువు.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!