Forcibly Kiss: లైంగికంగా వేధించబోయిన తన మాజీ బాయ్ ఫ్రెండ్ కు ఓ యువతి తగిన బుద్ది చెప్పింది. వద్దన్నా వినకుండా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి నాలుకను గట్టిగా కొరికింది. దీంతో అతడి నాలుక తెగిపడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. నాలుక తెగి బాధతో అల్లాడిపోతున్న అతడిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగిస్తున్నారు వైద్యులు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కాన్పూర్ సమీపంలోని దరియాపుర్ గ్రామానికి చెందిన చాంపి అనే 35 ఏళ్ల వ్యక్తికి గతంలోనే పెళ్లయింది. అయినా, మరో యువతితో క్లోజ్ గా ఉంటున్నాడు. రీసెంట్ గానే అమెకు పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో ఆమెకు అతడికి దూరంగా ఉంటున్నాడు. అయినా చాంపి.. ఆమె వెంటపడుతున్నాడు. తనకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని, దూరంగా ఉండాలని ఆమె పదే పదే చెప్తున్నా, వినడం లేదు. తాజాగా ఆమె చెరువు దగ్గరికి వెళ్లడంతో.. వెనుక నుంచి ఫాలో అవుతూ వెలాడు. ఆమెను లైగింకంగా వేధించడం మొదలు పెట్టాడు. అతడిని నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే, ఆమె అతడి నాలుకను గట్టిగా కొరికింది. అతడి నాలుక తెగి కిందపడింది.
హాస్పిటల్లో చేర్చిన స్థానికులు
నాలుక తెగిపడి, తీవ్ర రక్తస్రావం కావడంతో నొప్పిన తట్టుకోలేక చాంపి అరిచాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు విషయం ఆరా తీశారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అతడిని కాన్పూర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పిన డిప్యూటీ కమిషనర్ దినేశ్ త్రిపాఠి.. విచారణ చేసి కేసు బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామన్నారు.





