
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- తమిళ హీరో విజయ్ హీరో గానే కాకుండా రాజకీయాలతో కూడా ప్రజల గుండెల్లో మరియు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చూస్తున్నారు. ఇక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండడమే కాకుండా విస్తృతస్థాయిలో రాజకీయాల్లో ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హీరో విజయ్ టీవీకే పార్టీని స్థాపించి విస్తృత స్థాయిలో ప్రచారాలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా విజయ్ కు ఎన్నికల కమిషన్ ఒక గుర్తుని కేటాయించింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. దానికి కారణం విజిల్ గుర్తు. తాజాగా ఈసీ ఇవాళ హీరో విజయ్ టీవీ కే పార్టీకి విజిల్ గుర్తును కేటాయించింది. ఇప్పటికే విజిల్ పేరిట హీరో తలపతి విజయ్ సినిమా కూడా తీశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విజిల్ గుర్తుతో ఎటువంటి గందరగోళం లేకుండా ఎలక్షన్ రోజున విజయ్ పార్టీకి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు విజిల్ అనే సినిమా పేరిట మరోవైపు రాజకీయంలోనూ అదే గుర్తును కేటాయించడంతో టీవీకె పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. రెండింటికి లింక్ చేస్తూ “విజిల్ పోడు” అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు. సినిమా మాదిరే పార్టీ కూడా ఎన్నికల్లో విజిల్ వేసి గెలుస్తుంది అని సంబరపడుతున్నారు. ఇక ఈ ఏడాది వేసవికాలంలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Read also : మైదానంలో ఆడడం ఒక ఎత్తు.. ఇంట్లో చూడడం మరో ఎత్తు : రోహిత్ శర్మ
Read also : మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్‌లో ‘Hi’ మెసేజ్ చేస్తే చాలు!





