Homeజాతీయంకాంగ్రెస్ కు విజయ్ ఆఫర్!

కాంగ్రెస్ కు విజయ్ ఆఫర్!

•ఏకైక రాజ్యసభ పదవి హస్తం పార్టీకి..
•దళపతి వ్యూహాత్మక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు. సుస్థిర ప్రభుత్వం కొనసాగింపు దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తన పార్టీకి వచ్చిన రాజ్యసభ పదవి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి విడిచిపెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసవంతమైన, వ్యూహాత్మకమైన నిర్ణయం. తన ప్రభుత్వాన్ని మరింత సుస్థిరం చేసేందుకు విజయ్ పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతుంది. ఐదు దశాబ్దాల స్నేహాన్ని వదులుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నిజమైన గౌరవం ఇచ్చి నమ్మదగిన మిత్రుడిగా మారారు విజయ్.

తమిళనాడులో ఒక పదవి..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 24 రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. తమిళనాడులో రాజ్యసభ పదవి టివికే కు దక్కే అవకాశం వచ్చింది. కానీ సీఎం విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి ఆ రాజ్యసభ పదవి ఇచ్చారు. జాతీయస్థాయిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవి అవసరం. పార్లమెంటులో ఆ పార్టీకి బలం అవసరం. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవసరం టీవీ కేకు ఉంది. అందుకే విజయ్ తనకు లభించిన ఏకైక రాజ్యసభ పదవిని కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేశారు. ఇది నిజంగా సాహసమైన నిర్ణయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ స్నేహ హస్తం..
కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘకాలం స్నేహాన్ని విడిచిపెట్టి డీఎంకేకు గుడ్ బై చెప్పింది. విజయ్ కు స్నేహ హస్తం అందించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూత వేటు దూరంలో నిలిచిపోయింది టీవీకే. 108 స్థానాలకు పరిమితం అయింది. అటువంటి సంక్లిష్ట సమయంలో ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ డిఎంకెను విడిచిపెట్టి.. విజయ్ తో జత కలిపింది. విజయ్ ప్రమాణస్వీకారానికి స్వయంగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే తనకోసం సుదీర్ఘకాలం స్నేహాన్ని విడిచిపెట్టి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాజ్యసభ పదవి ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నారు విజయ్. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న తరుణంలో.. తనకున్న రాజ్యసభ పదవి వదులుకోవడం ద్వారా సరైన స్నేహితుడిని అని నిరూపించుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు