
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- తమిళనాడులోని కరూర్ ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసలాట యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కరూర్ లో చాలా చిన్నపాటి స్థలంలో సభ నిర్వహించగా భారీగా తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలుసు. ఈ తొక్కిసలాటలో భాగంగా దాదాపు 41 మంది మరణించారు. ఇంకెంతో మంది గాయాలు పాలై చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై అప్పటిలో చాలానే వైరల్ కాగా… తాజాగా ఈ తొక్కిసలాటలో భాగంగా మరణించిన కుటుంబాలను వ్యక్తిగతంగా కలవాలని విజయ్ నిర్ణయించుకున్నారట. ఈనెల 27 అనగా రేపు చెన్నై దగ్గరలోని ఒక రిసార్ట్ లో మరణించిన బాధిత కుటుంబాలను కలవనున్నారు అని సమాచారం. ఇప్పటికే రిసార్ట్ లో 50 గదులకు పైగా బుక్ చేసినట్లుగా సమాచారం అందింది. ప్రతి కుటుంబాన్ని కూడా వ్యక్తిగతంగా కలిసి విజయ్ పరామర్శించనున్నారని సంబంధిత పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ర్యాలీలో భాగంగా ఈ బాధిత కుటుంబాలను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే వారినే ఒక రిసార్ట్ కు పిలిచి ప్రత్యేకంగా పరామర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
Read also : సెంచరీ తో విరుచుకుపడ్డ రోహిత్.. ICC వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం?
Read also : సెంచరీ తో విరుచుకుపడ్డ రోహిత్.. ICC వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం?





