
క్రైమ్ మిర్రర్, తమిళనాడు న్యూస్ :- కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా మృతి చెందారు. కానీ ఘటన తర్వాత రెండు రోజులు మాత్రమే సోషల్ మీడియాలో ఈ ఘటన మారుమ్రోగింది. ఆ తరువాత నెమ్మదిగా ఈ తొక్కిసలాట ఘటన గురించి ప్రజలు కూడా మర్చిపోతున్నారు. అయితే తాజాగా కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహంతో తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ టీవీకే అధినేత విజయ్ పై చర్యలకు సిద్ధమవుతుంది. ఈ ఘటన తర్వాత విజయ్ పై నిందితుడిగా కేసు పెట్టాలా లేక దుర్ఘటనకు కారకుడిగా చేయడం లేదా ఇతర ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా అనేది దీర్ఘంగా పరిశీలన మొదలుపెట్టింది. ఇక మరోవైపు టీవీకి పార్టీ అధినేత విజయ్ మాత్రం ఎటువంటి భయం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్న ఎదుర్కునేందుకు నేను సిద్ధమే అని టీవీకే పార్టీ నేతల భేటీలో విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కరూర్ ఘటనపై 41 మంది చనిపోతే ఇప్పటివరకు సుమోటో కేసు ద్వారా ఇద్దరు కిందిస్థాయి నేతల అరెస్టు లేనా?.. ఈ తొక్కిసలాట ఘటనకు ముఖ్య కారకుడు విజయ్ పై ఎటువంటి చర్యలు తీసుకోరా?.. అని హైకోర్టు గత వారం ప్రశ్నించిన విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో అధికారంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం విజయ్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఉత్కంఠంగా మారింది. ఒకవేళ విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక సంచలన ఘటనలు జరిగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. మరి స్టాలిన్ ఎలాంటి ఆలోచన చేసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వెయిట్ చేసి చూడాల్సిందే.
Read also : పొరపాటున తప్పు నెంబర్లకు డబ్బులు పంపించారా?… టక్కున ఈ నెంబర్లకు కాల్ చేయండి మీ సమస్యను తీర్చుకోండి!
Read also : ఏపీలో పిడుగులతో కూడిన భయంకర వర్షం?