
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చేదు ఘటన చోటుచేసుకుని నేటికి దాదాపు నెల నెలరోజులు దాటిపోయింది. కరూర్ లో జరిగినటువంటి తొక్కిసులాట యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొన్ని కీలక మలుపులు తిప్పింది. ఈ కరూర్ తొక్కిసలాట ఘటనలో దాదాపు 41 మందికి పైగా మరణించారు. ఇది ఆ సమయంలో కేవలం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అన్ని రాష్ట్ర రాజకీయాలకు ఒక హెచ్చరికలా మారిపోయింది. విజయ్ కొత్త పార్టీ పెట్టిన తర్వాత బాగా సాగుతూ ముందుకు వెళుతుంది అని అనుకున్న సమయంలో… ఒక్కసారిగా ఈ తొక్కిసలాట ఘటన జరగాక రాజకీయాలే తారు మారయ్యాయి. అయితే ఈ ఘటన తర్వాత కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ విజయ్ కి ఈ తొక్కిసలాట ఘటన వల్ల ఓటర్లు తగ్గే అవకాశం లేదు అని స్పష్టం చేశాయి. ఏది ఏమైనా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఘటనపై రాద్ధాంతం చేయకుండా కామ్ గా ఉన్నాయి.
Read also : విద్యార్థి మృతదేహాన్ని ట్రాక్టర్ లో తరలించడంపై కేటీఆర్ ఆగ్రహం!
అయితే దాదాపు 30 రోజులకు పైగా తర్వాత నేడు తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాలను టీవీకె పార్టీ చీఫ్ విజయ్ కలిశారు. చెన్నైలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో 50 రూమ్స్ పైగా బుక్ చేసి పార్టీ నేతలు అందరూ కలిసి బస్సులో చనిపోయిన బాధిత కుటుంబాలను తీసుకువచ్చారు. బాధితులతో విజయ్ కాసేపు మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా పార్టీ తరఫున అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే మరణించిన వారికి ఒక్కొక్కరికి 20 లక్షలకు పైగా రూపాయలను పరిహారంగా ప్రకటించారు. దీంతో కరూర్ ఘటనపై దాదాపు చాలామంది శాంతించారనే అర్థమవుతుంది.
Read also : సీఎం రేవంత్ కు మరో మంత్రి ఝలక్.. తలపట్టుకున్న హైకమాండ్





