క్రైమ్ మిర్రర్ కరీంనగర్ జిల్లా: దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ రాజన్న ఆలయం ఇటీవల భక్తులకు చేరువ కాకుండా మారిపోతోంది. ఆలయ అభివృద్ధి పనుల పేరుతో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
ఇప్పటికే కొంతకాలంగా రాజన్న గుడిలో సాధారణ దర్శనాలను నిలిపివేసిన అధికారులు, తాజాగా ఆలయంలోకి ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులు అమర్చారు. ప్రస్తుతం స్వామివారి చతుష్కాల పూజలకు కేవలం అర్చకులను మాత్రమే అనుమతిస్తున్నారు.
రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా భక్తులు భీమేశ్వరాలయంలోనే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు నిర్వహిస్తున్నారు. సుమారు నెల రోజులుగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు, ప్రాకారాల తొలగింపులు జరుగుతున్నాయి.
Also Read:తెలంగాణలోని విద్యార్థులకు చేపల కూర…!
ఆలయం దక్షిణ, ఉత్తర భాగాల్లో ప్రాకారం, పడమర వైపు నైవేద్యశాల, ఈవో కార్యాలయాన్ని ఇప్పటికే కూల్చివేశారు. ఈ నేపథ్యంలో భక్తులు లోనికి రాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇనుప రేకులు అమర్చారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున ప్రధాన ద్వారాన్నీ పూర్తిగా మూసివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా కార్తీక మాసంలో వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ ప్రధాన ద్వారం మూసివేయడంతో స్వామి వారి దర్శనం సాధ్యంకాకపోవడంతో, రాజన్న ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లకే మొక్కులు వేసి వెళ్లిపోతున్నారు.
Also Read:బ్రేకింగ్ న్యూస్.. డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!
ఈ పరిస్థితి వేములవాడలో ఉన్న ఆ భక్తి క్షేత్రాన్ని వెలవెలబోయేలా చేస్తోంది. స్థానిక భక్తులు ఆలయ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ద్వారం మూసివేయడం సరికాదని, తక్షణమే భక్తులకు దర్శనాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:బ్యాంక్ కు లంచ్ బ్రేక్ అనేది ఉండదు.. ప్రజలు గమనించాలి!
Also Read:తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్ గా మారిన టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి!





