
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు :- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం రోజున వసంత పంచమి సందర్భంగా సరస్వతి విద్యాలయంలో వేదశ్రీ పండితులు మూటకొండూరు కార్తీక్ శర్మచే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ వసంత పంచమి విశిష్టతను అలాగే సరస్వతి దేవి గొప్పతనాన్ని కార్తీక్ శర్మ చిన్నారుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తొర్ర విష్ణు,ప్రిన్సిపాల్ పంజాల నర్సయ్య మాట్లాడుతూ విద్య వలన విజ్ఞానం మరియు చైతన్యం కలుగుతాయని విద్య యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కే ఐలయ్య, ఉపాధ్యాయులు చెరుకు విష్ణు, సుధాకర్ ,యాసిన్ ,లలిత, సంతోష,మహేశ్వరి,
ఉపేంద్ర,సంధ్య,మాధవి,గంగ ,లక్ష్మి, రేణుక, కృష్ణవేణి, లావణ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read also : బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్..?
Read also : నా డైలాగ్ పై పిల్లలు చేత రీల్స్ చేయించొద్దు : అనిల్ రావుపూడి





