
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కావాలనే భారత్ ను అవమానిస్తున్నారంటూ కొంతమంది భారతీయులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా H-1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని కీలక ప్రకటన చేసింది. అమెరికన్లకు ఉద్యోగాల్లో పోటీ తగ్గించేందుకు డోనాల్డ్ ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంపై మన భారతీయులు చాలా రకాలుగా మండిపడుతున్నారు. ఎందుకంటే గత ఏడాదిలో భారతీయులకు అత్యధికంగా ఈ H-1B వీసాలు (71%) దక్కాయి. దీనివల్ల భారతీయులు ఎక్కువగా నష్టపోతారని డోనాల్డ్ ట్రంప్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీసాలు అనేవి మూడేళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుంటాయి.
Read also : GST ఎఫెక్ట్.. ధరలు తగ్గిస్తున్నట్లు డెయిరీ లు ప్రకటన!
కొంచెంసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే… తాజాగా అమెరికా కామర్స్ సెక్రటరీ హోవర్డ్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనికిరాని వ్యక్తులు అమెరికాకి రావద్దు.. అని అలాంటి వారిని అడ్డుకోవాలని అన్నారు. కేవలం అత్యుత్తమ, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాకు రావాలి అని.. కామర్స్ సెక్రెటరీ హోవర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ H1B వీసాలతో అమెరికా వెళ్ళేది ఎక్కువగా భారతీయులేనని.. హో్వర్డ్ చేసిన వ్యాఖ్యలు భారతీయులను ఉద్దేశించే చేశారని.. నెటిజనులు అమెరికాపై తీవ్రంగా మండిపడుతున్నారు. కావాలనే భారతీయులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని… చాలా రోజుల నుంచి డోనాల్డ్ ట్రంప్ కూడా సుంకాల విషయంతో పాటు పలు రకాలుగా భారతీయులపై ఆగ్రహంగా ఉండడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా పనికిరాని వాళ్ళు అమెరికాకు రావద్దని భారతీయులను ఉద్దేశించి అనడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో భారత్ మరియు అమెరికా మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉంటాయో ఎవరికీ కూడా అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.
Read also : మోడీపై ద్వేషాన్ని దేశం మీద వెళ్లగక్కే ప్రయత్నం సబబేనా రాహుల్?